• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

భవ్య భీమవరం అభివృద్ధి పనులు పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 03/09/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రదేశాలలో చేపట్టిన పనులు పురోగతి మరియు పింక్ టాయిలెట్స్ నిర్మాణాలుకు తీసుకున్న చర్యలపై రెవెన్యూ, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవ్య భీమవరం పట్టణం సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. భీమవరం పట్టణం పరిశుభ్రముగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చేపట్టిన పనులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పార్కుల అభివృద్ధి పింక్ టాయిలెట్స్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవసరమైన స్థలాలను పరిశీలించాలని ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ని ఆదేశించారు. పింక్ స్థల పరిశీలన జాప్యం చేయటంపై టిపిఓ, మున్సిపల్ సర్వేపై ఆయన ఆగ్రహించారు. భీమవరం పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద జరిగే పనులు విష్ణు కాలేజ్, హౌసింగ్ బోర్డు, ఆదిత్య కాలనీ పార్క పనులు కంతేటి వెంకటరాజు, పాత బస్టాండ్ ఆధునీకరణ పనులు, సిహెచ్ మురళీకృష్ణంరాజు, అడ్వార్డు ట్యాంక్ జువ్వలపాలెం రోడ్డు, ఎస్ ఆర్ కె ఆర్ మార్గ్, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస్టాండ్ పనులు విష్ణు కాలేజ్, రోటరీ క్లబ్, భీమవరం హాస్పటల్, ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతి, నిధులు లభ్యత, గుత్తేదారుల ఎంపికపై అధికారులు తీసుకున్న చర్యలు పై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం శాఖ అధికారి వెంకట అప్పారావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, మున్సిపల్ డిఇ టి.త్రినాథ్ రావు, ఆర్ అండ్ బి ఎస్.సి ఎ.శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.