• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

Publish Date : 01/08/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ భూములు రీ సర్వే సంబంధించి రెవిన్యూ, సర్వే, పంచాయితీ, ఆర్ అండ్ బి,ఇరిగేషన్,దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 72 గ్రామాలలో మొత్తం రీ సర్వే కాకుండా, ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ప్రభుత్వ భూములలో ఆర్ అండ్ బి, పంచాయితీ, ఇరిగేషన్, దేవస్థానం, వక్ఫ్ బోర్డ్, అసైన్మెంట్ భూములకు సంబంధించి సరిహద్దులు నిర్ధారణ చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. 72 గ్రామాలకు మొత్తం విస్తీరణ 2,లక్షల 89 వేలఎకరాలకు గాను ఇందులో ప్రభుత్వ భూములకు సంబంధించి 24 వేల 474 వందల ఎకరాలు ఉన్నాయని అన్నారు. ఈ భూములు అన్నిటికీ సంబంధించి నవంబరు నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేయాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే అధికారి కె .జాషువా, జిల్లా పంచాయతీ అధికారి ఎం రామ్ నాద్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి రఘునాథ బాబు, సిపిఓ కంటిపూడి శ్రీనివాసరావు,డ్రైన్స్ అండ్ ఇరిగేషన్ ఇ ఇ సి హెచ్ సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఇ ఇ శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.