• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నదని, భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతోకొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 01/09/2025

సోమవారం తాడేపల్లిగూడెం సావిత్రు పేటలో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను ఈ రోజు సెప్టెంబర్ 1న వేకువజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 2,26,513 మందికి రూ.97.58 కోట్లు ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీకి మంజూరు చేయడం జరిగిందన్నారు. గత కొద్ది నెలలుగా జరుగుచున్న రీ వెరిఫికేషన్ లో భాగంగా ఆరోగ్య పింఛన్లు, దివ్యాంగ పింఛన్లను తొలగించలేదని వెల్లడించారు. తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులను జారీ చేయడం జరిగిందని, వారు 30 రోజులు లోగా అప్పీల్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లను అందజేయడం జరుగుచున్నదని, లబ్ధిదారులు ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, డి ఆర్ డి ఏ పి.డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, తహసిల్దార్ సునీల్ కుమార్, స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.