Close

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్ పి జి గ్యాస్ కనెక్షన్స్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు

Publish Date : 26/04/2025

శనివారం జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి, బిపిసిఎల్, హెచ్ పిసిఎల్, ఐఓసీఎల్ గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్ లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది నాటి నుండి రెండు సంవత్సరాలుగా రీఫిల్ తీసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేస్తాయాలన్నారు. జాబితాలో లబ్ధిదారుడి పేరు, కనెక్షన్ తేదీ, ఎల్పిజి ఐడి, చిరునామా & మొబైల్ నంబర్ వంటి వివరాలతో సరిచూడాలన్నారు. ఇప్పటికే గుర్తించిన గ్యాస్ రీఫిల్ తీసుకొని 100 మంది లబ్ధిదారులు ఉన్నారా, లేరా సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. తొలుత లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ ను మళ్ళీ పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు తెలపాలన్నారు. అనంతరం ఈకేవైసీ పూర్తి చేసుకోని లబ్ధిదారులు జాబితాను స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించి, ఆ తేదీ నుండి తదుపరి 7 రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఒక చివరి అవకాశాన్ని ఇచ్చే తుది నోటీసు జారీచేయాలన్నారు. ఈ వ్యవధిలోపు ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే, వినియోగదారుల డేటాలో నకిలీ, మరణించిన లబ్ధిదారుల కనెక్షన్‌లను శాశ్వతంగా నిలిపివేయడానికి, పీఎంయువై కనెక్షన్ రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, హెచ్ పి సి ఎల్ సీనియర్ మేనేజర్ టి.సి వెంకటేశ్వర్లు, ఐఓసిఎల్ మేనేజరు ఎం.వి రామప్రసాద్, బిపిసిఎల్ సేల్స్ మేనేజర్ చాంద్ మండల్, తదితరులు పాల్గొన్నారు.