ప్రతి సోమవారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న రెవిన్యూ క్లినిక్ లు..
7 విడతలుగా 72 దరఖాస్తులు పరిష్కారం..
రెవెన్యూ క్లినికల్ ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతంగా జరుగుచున్నది..
రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు సత్ఫలితాలను నిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ తో పాటు సమాంతరంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ లను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. డిసెంబర్ 29,2025న రెవెన్యూ క్లినిక్ లు ప్రారంభం నాటి నుండి ఫిబ్రవరి 23, 2026 వరకు ఏడు దఫాలుగా రెవెన్యూ క్లినిక్ లను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 394 దరఖాస్తులు అందగా 65 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, ఏడు దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, ఇంకా 322 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. జిల్లాలోని డివిజన్ ల వారీగా భీమవరం డివిజన్ ఏడు మండలాల్లో 155 దరఖాస్తులు అందగా వీటిలో 29 పరిష్కరించడం జరిగిందని, నాలుగు తిరస్కరించడం జరిగిందని, ఇంకా 122 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. నరసాపురం డివిజన్ ఎనిమిది మండలాల్లో 161 దరఖాస్తులు అందగా 24 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, రెండు దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, ఇంకా 134 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం డివిజన్ లోని ఐదు మండలాల్లో 78 దరఖాస్తులు అందగా 12 దరఖాస్తుల పరిష్కరించడం జరిగిందని, ఒక దరఖాస్తును తిరస్కరించడం జరిగిందని ఇంకా 65 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. పరిష్కారానికి మిగిలిన దరఖాస్తులు వివిధ దశలలో ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువు లోపుగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. సదరు ఫిర్యాదులపై విచారణకు ఎక్కువ సమయం ఉండటం వలన వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని నాణ్యతతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెవిన్యూ క్లినికల్ ద్వారా భూ సమస్యలకు చక్కటి పరిష్కారం లభించిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.