పేదలకు అందించవలసిన రేషన్ సరుకులు పంపిణీ అవకతవకులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు…
మంగళవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో నెం.54 రేషన్ షాపును, నిత్యవసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్న (యండియు) వాహనం నెంబర్ డబ్ల్యు జి 007 ను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వాహనంలో, చౌక ధరల దుకాణంలో రికార్డులు ప్రకారం ఉండవలసిన స్టాకును ఈ పాస్ తో స్టాకు నిల్వలను తనిఖీ చేసి అదనంగా వున్న పంచదార నిల్వ తేడాను గమనించి, ఎండియు వాహన ఆపరేటర్, షాపు నిర్వాహకుడుపై కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ రావి రాంబాబును జిల్లా జాయింటు కలెక్టరు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతినెల పేదలకు ఎండియు వాహనములు ద్వారా పంపిణీ చేసే సరుకులలో అవకతవకలు జరిగితే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
జిల్లా జాయింటు కలెక్టరు వెంట తహాశీల్దారు రావి రాంబాబు, వీఆర్వో, సివిల్ సప్లై శాఖ సిబ్బంది, తదితరులు వున్నారు.