Close

పురపాలక సంఘాల పరిధిలో స్వచ్ఛతకు, పార్కుల అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 16/12/2025

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలి

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో ఫేజ్- 1, ఫేజ్ -2 కింద 21,424 ఇళ్ళు మంజూరు కాగా ఇప్పటివరకు 8,832 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందన్నారు. భీమవరం పురపాలక సంఘం పరిధిలో 8,352 ఇళ్ళకు గాను 1,984 మంది లబ్ధిదారులకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో 5,376 ఇళ్ల కు గాను 4,256 మంది లబ్ధిదారులకు, పాలకొల్లు పురపాలక సంఘ పరిధిలో 6,784 ఇళ్లకు గాను 2,592 మంది లబ్ధిదారులకు, తణుకు మున్సిపాలిటీ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించవలసి ఉందన్నారు. జిల్లాలో మెత్తం 11,952 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించవలసి ఉందన్నారు. 640 ఇళ్ళ మంజూరును రద్దు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. పురపాలక సంఘాల పరిధిలో పార్కుల అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్లు భీమవరం కె.రామచంద్రారెడ్డి, తాడేపల్లిగూడెం ఎం.ఏసుబాబు, తణుకు టి.రామ్ కుమార్, పాలకొల్లు బి.విజయ సారథి, తదితరులు పాల్గొన్నారు.