పి జి ఆర్ ఎస్ కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పి జి ఆర్ ఎస్ కు197 పిటీషన్లు
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కె సి హెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు,
ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ సమస్యలు పరిష్కారం ప్రగతిపై సమీక్షించారు. సమస్యల పరిష్కారం చేయడంలో అధికారులు మరింత శ్రద్ధ. చూపాలి అన్నారు. పిజిఆర్ఎస్ కు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత సమర్ధతను పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. సంబంధిత క్రింది స్థాయి అధికారులు పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు.
స్వీకరించిన ఫిర్యాదులు కొన్ని ఈ విధముగా ఉన్నవి
@ బోల్లనాగలక్ష్మి పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామనివాసి ఇంటి స్థలం మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు.
@ పెనుగొండ మండలం కాకిలేరు గ్రామం కానూరి నరసింహమూర్తి దరఖాస్తు చేసుకుంటూ నాకు 61 సంవత్సరాలు అని వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
@ పెంటపాడు మండలం వల్లూరు పల్లి గ్రామం తేతలి నిర్మల దస్తావేజులు ప్రకారం మాకు 2.33 భూమి ఉండాలని, ఎల్ పి నెంబర్ యందు 2.24, భూమి మాత్రమే నమోదు అయినది 9 సెంట్లు భూమి తగ్గియున్నది సర్వే చేసి తగ్గిన భూమిని చూపించాలని ఫిర్యాదులో కోరారు.
@ యలమంచిలి మండలం చించినాడ గ్రామం తాడి పుష్పలత, తాను నివాసముంటున్న ఇంటి ముందు గొల్ల పెద్దిరాజు ఇంటి వాడకం నీరు అంతా నిల్వ ఉండి దుర్వాసన వస్తున్నదని, డ్రైయిన్ నిర్మించుకోమని పంచాయితీ ద్వారా తెలియపరచగా ఏటువంటి చర్యలు తీసుకోలేదనీ, చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.
@ మళ్లీ సుబ్బారెడ్డి అత్తిలి గ్రామ నివాసి దరఖాస్తు సమర్పిస్తూ సరిహద్దు స్థలం వారివి రెండు కొబ్బరి చెట్లు మా ఇంటి పైకప్పు మీదికి వాలి ఉన్నవి, అవి చాలా సంవత్సరాలు నాటి చెట్లు కావడం వలన చిన్నపాటి గాలి వేసిన చెట్లు వలన ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నాము. కావున చర్యలు తీసుకుని వెంటనే కొబ్బరి చెట్టు తొలగించాలని కోరారు.
@ యలపర్తి వీర నాగబాబు వేల్పూరు గ్రామం తనకు చెందిన 60.7 సెంట్లు భూమిని తాను వికలాంగుడు అయిన కారణంగా అలుసుగా తీసుకుని తన మేనమామ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయో వృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబెర్ మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.