పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, ఆదాయం పెరుగుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలి
బియ్యం మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగిస్తే రైస్ మిల్లర్లు వ్యాపారం ద్వారా మరింత ఆర్థికంగా బలపడతారు
బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా విలువను సృష్టించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, రైస్ మిల్లల్లో అందిపిచ్చుకోవాలి…
సాంప్రదాయ మిల్లింగ్ నుండి రైస్ మిల్లర్లు వినూత్నంగా ఆలోచనచేసి వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందాలి
కాళ్ల మండలం పెద్దఅమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు, అధికారులు, కీలక వాటాదారులతో జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైస్ మిల్లుల యజమానుల కార్యకలాపాల వైవిధ్యీకరణ మరియు విలువ జోడింపు అవకాశాలపై, విలువ జోడింపు ద్వారా కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లాభదాయకతను పెంచుకోవడానికి ఏర్పాటుచేసిన ఎం.ఎస్.ఎం.ఈ అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా మిల్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న, అనుకున్నంతగా ఎదగలేదన్నారు. ఆధారిత పరిశ్రమంలు నెలకొల్పకపోవడం దీనికి ఒక కారణంగా ఉందన్నారు. బాయిల్డ్ అండ్ స్టీల్ ప్రైస్ చేస్తూ ఉండిపోవడం జరిగిందన్నారు. మన జిల్లాలో ఉన్న మిల్లులు నాలుగు నెలలు పనిచేసి మిగతా సమయం అంతా ఖాళీగా ఉండటం అనేది చాలా బాధాకరం అన్నారు. శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లాగా ఉండేదని, అలాగే అనంతపురం జిల్లా ఎడారి కింద అయిపోతుంది అని చెప్పే పరిస్థితుల నుండి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. మన జిల్లాని కేవలం రైస్ మిల్లర్స్ కే పరిమితం చేయకుండా ఫుడ్ ప్రాసెసింగ్ లో మంచి ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ముందుకు రావాలన్నారు. మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని, మీ సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు తరచుగా వర్క్ షాప్ లు నిర్వహించాలని జిల్లా పరిశ్రమశాఖ అధికారులు ఆదేశించారు. ధాన్యం మిల్లింగ్ ద్వారా వచ్చే ప్రధాన బై-ప్రొడక్ట్స్ బియ్యం పొట్టు ద్వారా రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ, పశువుల ఆహారం, బ్రాన్ ఆధారిత సబ్బులు, కాస్మెటిక్స్ తయారు చేయొచ్చు అన్నారు. పగిలిన బియ్యంతో (బ్రోకెన్ రైస్) బియ్యం పిండి, బియ్యం స్నాక్స్ మురుగులు, పాపడ్స్, రైస్ క్రాకర్స్ తయారు చేయవచ్చు అన్నారు. అలాగే బీర్, ఆల్కహాల్ తయారీకి రా మెటీరియల్ గా ఇది ఉపయోగపడుతుందన్నారు. బియ్యం తొక్క (ఊక) బయోమాస్ ఎనర్జీ, సిలికా ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమలకు వినియోగించ వచ్చుఆన్నారు. వరి గడ్డి పశువుల ఆహారం, బయోగ్యాస్ ఉత్పత్తి, పేపర్, కార్డ్బోర్డ్ తయారీ వంటివి తయారు చేయడం జరుగుతుందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్‌కు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. మిల్లర్లు గ్రూపుగా ఏర్పడి బై-ప్రొడక్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుంటే ఖర్చు తగ్గుతుందన్నారు. తద్వారా వినియోగదారులకు కూడా అందుబాటు ధరలో ఉత్పత్తులను విక్రయించడానికి విసులుబాటు కలుగుతుందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, సిలికా, బయోమాస్ పెల్లెట్స్కు విదేశీ మార్కెట్ ఉందని , పశ్చిమగోదావరి జిల్లాలో సిలికా క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు సమావేశంలో ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుండి ఎమ్. ఎస్.ఎం.ఇ, నాబార్డు, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుండి సబ్సిడీలు, రుణాలు పెద్ద ఎత్తున పొందవచ్చు అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందన్నారు. మన జిల్లాలో పెట్టుబడిదారులకు, యువ వ్యాపారవేత్తలకు గాని కొదవలేదని వారిని ఒక వేదిక పైకి తీసుకువచ్చి నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం అందించి యూనిట్ల స్థాపన ద్వారా జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో 207 రైస్ మిల్లుల వరకు ఉన్నాయని, మిల్లుల యజమానులను క్లస్టర్ గా ఏర్పాటు చేసి వారికి రైస్ ఆధారిత ఉప ఉత్పత్తుల పై అవగాహన కల్పించి యూనిట్ల స్థాపన ద్వారా మరింత జిడిపి సాధించవచ్చు అన్నారు. రైస్ మిల్లర్లు నూతన ఆలోచనలతో కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని జిల్లా పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగిందని ఆర్గానిక్ ఉత్పత్తులపై మిల్లర్స్ రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే రైస్ మిల్లర్స్ బై ప్రొడక్ట్స్ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. నూతన ఉత్పత్తుల ఉత్పత్తుల తయారీకి రైస్ మిల్లర్ రైస్ మిల్లర్లు ముందుకు రావాలని అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందన్నారు.
తొలుత రైస్ ద్వారా తయారు అయ్యే వివిధ ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు పరిశీలించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు, ఎన్ ఆర్ డి ఎన్ ఆర్ డి సి ప్రతినిధి శాంతన్, క్లస్టర్ కన్సల్టెంట్ ఫణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎం.డి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్ సరోజ, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.నాగేంద్రప్రసాద్, విశాఖపట్నం ఎన్ఆర్డిసి జూనియర్ సైంటిఫిక్ మేనేజర్ జి.శంతను కుమార్, క్లస్టర్ కన్సల్టెంట్ ఫణి, లలిత ఇండస్ట్రీస్ శ్రీనివాస్, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏఎస్ఓ రవిశంకర్, రైస్ మిల్లుల యజమానులు, ఎం ఆర్ ఎం ఎస్ ఎం ఈ ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
