Close

పత్రికా ప్రకటన , ఏలూరు,తేదీ : 10-08-2021. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మూడవ విడత వైఎస్సార్ నేతన్న నేస్తం 2021 -2022 కింద అర్హులైన నేతన్నల ఖాతాల్లో బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు.

Publish Date : 10/08/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు,తేదీ : 10-08-2021.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మూడవ విడత వైఎస్సార్ నేతన్న నేస్తం 2021 -2022 కింద అర్హులైన నేతన్నల ఖాతాల్లో బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు.

జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోందని , మూడవ విడత కూడా 2021-22 ఆర్ధిక సంవత్సరం లో పశ్చిమగోదావరి జిల్లా లోని 858 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.205.92 లక్షల లను ఆర్ధిక ప్రయోజనం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలోకి జమచేయడం జరుగుతుందన్నారు.

గత ఆర్థిక సంవత్సరం రెండవ విడత పశ్చిమగోదావరి జిల్లాలో (2020-21) లో జిల్లాలో 1119 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేలు చొప్పున జిల్లాలో నేతన్నల బ్యాంకు ఖాతాలకు రూ.2,68,56,000 ల మొత్తాన్ని నేరుగా జమ చేసి ఆదుకోవడం జరిగింది.

2019-20 సంవత్సరం లో మెదటి విడత లో 889 మంది లబ్ది దారులకు రూ. 213.36 లక్షల వారి ఖతలో జమచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం నేత కార్మికులకు 2021-22 సంవత్సరం నకు సంబంధించి రూ. 205.92 లక్షల చెక్కును లబ్ధిదారులకు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నా జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా , జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి పద్మావతి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కే. అప్పారావు, చేనేతకారులు తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.PressRelease