Close

పట్టాదారు పాసు పుస్తకాలు రైతుకు ఒకసారి అందజేసిన తరువాత మరల తప్పులు పునరావృతం కాకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 29/01/2026

క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలి

ప్రభుత్వ ఆదేశాలు మేరకు ప్రతి పట్టాదారు పాసుపుస్తకంను రైతుకు అందజేసే ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి అందజేయాలని, ఒకసారి అందజేసిన తర్వాత తప్పులు ఎట్టి పరిస్థితుల్లో పునరావతం కాకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధింత అధికారులు ఆదేశించారు.

ఇరగవరం మండలం కoతేరు గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. ఎటువంటి తప్పులు ఆస్కారం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో రైతులకు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈకేవైసీ పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు పొరపాటుగా ముద్రించినవి ఏమైనా ఉంటే రైతులు పరిశీలించుకోవాలని అన్నారు. ఏమైనా పొరపాటులు ఉంటే వాటి వివరాలతో దరఖాస్తు చేస్తే వెంటనే వాటిని సరిచేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఒకసారి ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో మరల తప్పులు పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించి రైతులకు కావయాపన లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇరగవరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆర్డీవో కతీబ్ కౌసర్ భానో, తహాసిల్దార్ ఎం.సుందర్ రాజు, గ్రామ సర్పంచ్ గుడిమెట్ల ఆదిలక్ష్మి, ఎంపీటీసీ గుడిమెట్ల దుర్గ, ప్రజా ప్రతినిధులు గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.