పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మొత్తం 77 డిడిఓ కార్యాలయాలయ భవనాలను లాంచనంగా వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలంలోని విస్సా కోడెరు గ్రామంలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జె.ఎస్.పి నాయకులు జుత్తుగ నాగరాజు, డీఎల్డిఓ వై.డోసి రెడ్డి, సమిత్వ స్టేట్ డైరెక్టర్ ఎ.నిషాంత్ రెడ్డి, డ్వామా ఎపిడి పి.సుజాత, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డి డి ఓ, డిఎల్పిఓ, ఏపీఓ, సిబ్బంది గదులను పరిశీలించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు డి డి ఓ కార్యాలయ ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, వారికి సంబంధించిన వివిధ రకాల పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకుండా డివిజనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల వద్దకు రావాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలుపరుస్తున్న పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలపై డివిజనల్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారులు సజావుగా పర్యవేక్షించాలన్నారు. వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి డివిజనల్ అభివృద్ధి కార్యాలయ భవనాలను నూతనంగా నిర్మించడం ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యాలయంలో డిడిఓతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి, ఉపాధి హామీ సహాయ ప్రాజెక్టు అధికారి, సంబంధిత అధికారుల సిబ్బందికి వసతి కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా డి డి ఓ కు కొన్ని విధులు కేటాయించారని అందులో ముఖ్యంగా డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖల వారి సమన్వయంతో అభివృద్ధి సాధించాలన్నారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలను సజావుగా అమలు అయ్యేలా చూడాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు అన్ని విభాగాలపై పరిపాలనాపరమైన అధికారాలు వారు కలిగి ఉంటారన్నారు. డివిజన్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించుటకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల వారితో తరచూ సమీక్షలు నిర్వహించి ప్రజలకు కావలసిన కనీస అవసరాలను అందించుటకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డివిజనల్ అభివృద్ధి అధికారి వై.డోసి రెడ్డి, సమిత్వ స్టేట్ డైరెక్టర్ ఎ.నిషాంత్ రెడ్డి, డ్వామా ఎపిడి పి.సుజాత, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, ఇంచార్జి తహసిల్దార్ ఎం.రఘు, ఎంపీడీవో రెడ్డయ్య, ఈవోపీఆర్డి రాంప్రసాద్, జిల్లా ఇండస్ట్రియల్ అధికారి యు. ముంగపతిరావు, జిల్లా చేనేత శాఖా అధికారి అప్పారావు, డీఎస్ఓ ఎన్ సరోజ, ఐ సి డి ఎస్ పిడి డి శ్రీలక్ష్మి, డీఎఫ్ఓ బి.శ్రీనివాసరావు, ఎస్టి వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, జె.ఎస్.పి నాయకులు జుత్తుగ నాగరాజు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.