నేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా ఆకువీడు మండలం తాళ్లకోడు లే అవుట్ లో కంకణాల కృష్ణవేణి ఇంటిని ప్రారంభించి తాళాలు అందజేసిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కంకణాల కృష్ణవేణి ఇంటి నిర్మాణం పూర్తి..
ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో మూడు నెలల కాలంలోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశాల చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన కంకణాల కృష్ణవేణి ..
అందరూ కలుస్తున్నారు, నేను కలిస్తే పోయేదేముందిలే అనుకున్నా కానీ ఇంత త్వరగా ఇల్లు నిర్మించి ఇస్తారని ఊహించలేదు… లబ్ధిదారు కృష్ణవేణి.
రాష్ట్రవ్యాప్తంగా పీఎంఏవై గృహప్రవేశాలు సందడి నెలకొన్నవేళ, పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడు మండలం తాళ్లకోడు లేఅవుట్ నందు కంకణాల కృష్ణవేణి ఇంటి వద్ద రెట్టింపు సంతోషం నెలకొంది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు నందు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను కలుసుకున్న కంకణాల కృష్ణవేణి నాకు ఇంటి స్థలం మంజూరు చేశారు కానీ, ఇంటిని నిర్మించుకునే స్థోమత లేదని, ఇంటిని నిర్మించి ఇప్పించవలసిందిగా విన్నవించడం జరిగింది. ఆమె అభ్యర్థనను ఆలకించిన ఉప ముఖ్యమంత్రి వెంటనే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం, జిల్లా కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి అందజేయడంతో నేడు కృష్ణవేణి కి సొంత ఇంటి కల సాకారం అయ్యింది. ఇంటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రూ.1,50,000/- లు సమకూర్చగా, గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన రూ.1,80,000/- లు మొత్తం రూ.3,30,000/- లతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది. నేడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా కంకణాల కృష్ణవేణి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటి తాళాలను కృష్ణవేణికి అప్పగించడం జరిగింది. లబ్ధిదారు కంకణాల కృష్ణవేణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఏ ఆధారం లేని పేదల పట్ల వారికి ఉన్న దయ, జాలి ప్రతిరూపంగా నేడు ఈ గృహం నాకు సమకూరిందని, లేకపోతే నేను జీవితంలో ఇంటిని నిర్మించుకోలేననీ ఆమె తెలిపారు.
నూతన గృహప్రవేశం గృహప్రవేశం కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, డిఈ పి.శివరామరాజు, ఏఈలు కె.నాగేంద్ర, ఎమ్.ఎస్ అభితేజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.శ్రీనివాసరావు, కుప్పనపూడి గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ, ఆకివీడు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మోతుపల్లి ప్రసాద్, ఉండి నియోజకవర్గం జెఎస్పి ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఎంపీటీసీ బంటుమిల్లి పుణ్యవతి, నగర పంచాయతీ చైర్మన్ జె.హైమావతి, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, టిడిపి నాయకులు మద్దిశెట్టి త్రిమూర్తులు, బిజెపి నాయకులు కట్ రెడ్డి ఏడుకొండలు, కూటమి నాయకులు జన్ను గోపిరాజు, బండి కొండ, వెలగపల్లి అప్పులు, కోపల్లి సాయిబాబు, అల్లాడి బాలాజీ, ఎంవీఎస్ నాగమణి, పిల్లా బాబులు, గంధం ఉమా, ముత్యాల శివయ్య, గృహ నిర్మాణ శాఖ డిఈ, ఏఈలు, కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.