Close

నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 09/12/2025

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి

మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని సాధ్యమైనంత వరకు నూతన పారిశ్రామికవేత్తలు సంబంధిత భూ యజమానుల భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అబ్సింక హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు పేరుపాలెం బీచ్ లో బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ ఏర్పాటుకు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 30 ఎకరాల భూమిని మంజూరు చేయవలసిందిగా కోరగా సంబంధిత రెవిన్యూ అధికారులతో అవకాశాలను పరిశీలించి తెలియజేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్షిస్తూ అక్టోబర్ 30 నుండి నేటి వరకు వివిధ శాఖల అనుమతుల కోసం 1,218 ధరఖాస్తులు రాగా 1,170 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 48 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. ఎమ్.ఎస్.ఎం.ఇలు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పాలసీ కింద 09 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.0.42 కోట్లను రియంబర్స్మెంట్, సబ్సిడీలుగా మంజూరు చేయడం జరిగిందన్నారు. 02 క్లెయిమ్స్ కు సంబంధించి జనరల్ కేటగిరీలో పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ కింద రూ.16,63,897/-, 02 క్లెయిమ్స్ కు సంబంధించి జనరల్ కేటగిరీలో వడ్డీ రాయితీ కింద రూ.6,07,141/-, 04 క్లెయిమ్స్ కు సంబంధించి ఎస్సీ కేటగిరీలో వడ్డీ రాయితీ కింద రూ.1,56,228 /-, 01 క్లెయిమ్ కు ఎస్సీ కేటగిరీలో వడ్డీ రాయితీ కింద కింద రూ.17,86,229 /- మంజూరు చేయడం జరిగిందన్నారు. పిఎంఈజీపి పథకం 2025-26 కింద యూనిట్ల స్థాపన మంజూరు కొరకు 242 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 207 యూనిట్లు స్థాపించడం జరిగిందని, బ్యాంకుల వద్ద పెండింగ్ లో 120 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవలని సంబంధిత సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ర్యాంపు పథకంలో భాగంగా జిల్లాలో సెప్టెంబర్ మాసంలో 28 ఉద్యమ్ వర్క్ షాపులు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి
యు. మంగపతి రావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం.రామ్ నాథ్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, , జిల్లా లేబర్ ఆఫీసర్ ఆకన లక్ష్మి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ్ కుమారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.