Close

నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 29/10/2025

భీమవరం మండలం చిన్నఅమీరం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా నీటమునిగిన వరి పొలాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తుఫాను కారణం నీట మునిగిన వరి పొలాలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 5,984 ఎకరాలు వరి పంటకు గాను 1,689 రైతులకు సంబంధించిన 3,340 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 5 రోజులులో పంట నష్టాల వివరాలు సేకరించి సంబంధించిన యాప్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. అనకోడేరు, బొండాడ డ్రైన్ లు పూర్తిగా బాగు చేయకపోవడం, ఆక్రమణలకు గురికావడం వలన భారీ వర్షాలుకు పంట పొలాలు మునిగిపోయి ఏటా పంట నష్టపోతున్నామని రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డిఓ, తహసిల్దారులను డ్రైయిన్లు సర్వే చేయించేందుకు చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.

ఈ సందర్భంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏ డి ఏ కె.శ్రీనివాస్, తహసిల్దార్ రావి రాంబాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి యర్రంశెట్టి ప్రసాద్, రైతులు, తదితరులు ఉన్నారు.