నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

శుక్రవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్క్ ఫ్రంహోం, ఈ కేవైసీ, ఆధార్ నమోదు, మిస్సింగ్ సిటిజన్స్, మనమిత్ర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వివిధ సమస్యల పరిష్కారంపై సమీక్షిస్తున్న లక్ష్యం మేరకు ఫలితాలు సాధించలేకపోతున్నారన్నారు. లక్ష్య సాధనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పన్ను వసూళ్ల వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా టాయిలెట్ ఉండాలి అన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థుల పరీక్షా ఫలితాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, లభించే సౌకర్యాలు గురించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. మనమిత్ర యాప్ ద్వారా పౌరులకు లభించే సేవలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆధార్ నమోదు కానీ పిల్లలకు సత్వరమే ఆధార్ నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్ ప్రకటన లక్ష్యసాధనకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే సమీక్ష సమావేశానికి లక్ష్యసాధనకు తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతిపై తాజా నివేదికలతో హాజరుకావాలని ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డీ.ఈ.వో ఇ.నారాయణ, డీపీవో బి.అరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.