నిబంధనల ప్రకారం విద్యార్థులను సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాతే లోపలికి అనుమతి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు ఆకస్మిక తనిఖీ
ఎటువంటి మాస్ కాపీ జరగడానికి వీల్లేదు
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిఘా ఉంచాలి అధికారులు ఆదేశాలు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
భీమవరం మెంటే వారి జి వి ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజీలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సౌకర్యాలు, సీసీ కెమెరాల అమరిక, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి చేసిన సిట్టింగ్ ఏర్పాట్లు, తదితర అంశాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పరీక్షలు ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా సజావుగా నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలాంటి అక్రమాలు జరగకుండా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులను సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోపలికి అనుమతించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక ప్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్న వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థుల నుండి సేకరించే జవాబు పత్రాలను సీసీ కెమెరాలు పర్యవేక్షణలో నిర్వహించి వెంటనే సీల్ చేసి నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంలో డిఐఓ గొల్ల ప్రభాకర రావు, డిఇసి కె.వి రామారావు, తదితరులు ఉన్నారు.