Close

నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు నవంబర్ 13న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు

Publish Date : 10/11/2025

సోమవారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 13వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 13 ప్రముఖ కంపెనీలతో పాటు, మరికొన్ని ఇతర కంపెనీలలో ఉద్యోగఅవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కంపెనీలలో మొత్తం 500 లకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, 18 – 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. కంపెనీల నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ నందు https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, ఇతర వివరములకు ఈ క్రింది నెంబర్ల నందు 9502024765,
9440838388 సంప్రదించాలని తెలిపారు.

గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్, డిపిఓ బి.రామ్నాథ్ రెడ్డి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోస్త్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.