Close

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేనివిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 12/11/2025

తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాటుతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులుతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతమేర వరి కోతలు ప్రారంభమయ్యాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది, ఆర్ ఎస్ కే ల ద్వారా ఎంత ధాన్యము సేకరణ జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఏ ప్రొక్యూర్మెంట్ సెంటరు కు ఎన్ని సంచులు అవసరమో ముందుగానే ఆలోచన చేసి స్టాక్ నిల్వ ఉంచాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన గన్ని బ్యాగులు ఆయా రైతు సేవా కేంద్రాలకు సంబంధించి మిల్లర్స్ ద్వారా సేకరించి 50 శాతం అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే వాహనములు సిద్ధము చేయాలని అన్నారు. మిల్లులు వద్ద హమాలీలు సిద్ధంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యము దిగుమతి చేయాలని అన్నారు. తేమశాతం తెలిపే పరికరాలు కాలిబ్రేషన్ చేయాలన్నారు. మిల్లర్లతో బ్యాంక్ గ్యారంటీలు చేయాలన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసిన వాహనములు కాకుండా ఇంకా అవసరమైన వాహనములు రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులును ఆదేశించారు. ప్రతి ఆర్ ఎస్ కే వద్ద సిబ్బంది విధులు నిర్వహణలో ఎటువంటి సమయంలోనైనా రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. రైతులు అడిగే సలహాలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు. నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా జరగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

విజయలక్ష్మి రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

బుధవారం తణుకు మండలం తేతలి గ్రామంలో విజయలక్ష్మి రైస్ మిల్లును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైస్ మిల్లులో రికార్డులను, ట్రక్ షీట్లను పరిశీలించారు. రైస్ మిల్లులోను, రైతు సేవా కేంద్రంలోనూ తేమశాతం తెలిపే పరికరాలను తేడాలను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే మిల్లు వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ట్రాక్టర్ ట్రక్కులో ఎగుమతి చేస్తున్న గోనెసంచుల నాణ్యతను ఆయన పరిశీలించారు. ట్రాన్స్ పోర్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంలో జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా సహకార శాఖ అధికారి కె.మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి కె ఎస్ ఎం డి కృష్ణారావు, ఎంవిఐ శ్రీనివాసరావు, తహసిల్దార్లు అశోక్ వర్మ, సుందర్ రాజు, వంశి, మండల వ్యవసాయ అధికారులు కె.రాజేంద్రప్రసాద్, రాజేష్, రాఘవేందర్ రావు, ఎం.ఎల్.వోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.