దిత్వా తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
శుక్రవారం గణపవరం మండలం జల్లి కొమ్మర గ్రామంలో రైతు సేవా కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.
ధాన్యం కొనుగోలు, గోనె సంచులు సంబంధించిన రిజిస్టరును, ట్రక్ షీట్ లు పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమశాతం నమోదు చేయాలని ఆదేశించారు. దిత్వా తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద బరకాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రైవేట్ వెండర్లు వద్ద బరకాలు తీసుకుని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. కోతలు కోసి ఆరబెట్టిన దాన్యం తక్షణం మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోనె సంచులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పలు సూచనలు సలహాలను తెలిపారు. రైతులందరితో కలిసి ముఖ్యమంత్రి లేఖను ఆవిష్కరించారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు వ్యవసాయ అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లి సేకరించే సమాచారానికి అందరూ సహకరించాలని సూచించారు. అధికారులు సలహాలను సూచనలు పాటించాలన్నారు. పంట సాగులో ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని తగ్గించటం వంటి వాటిపై అవగాహన చేసుకోవాలన్నారు. సేంద్రియ వ్యవసాయం గురించి, డ్రోన్ లు వినియోగించడం వలన వ్యవసాయంలో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. పొలం గట్లు మీద కూరగాయలు పెంపకం చేయాలని రైతులకు సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా సివిల్ సప్లయ్ మేనేజరు ఎండి ఇబ్రహీం, డి ఎస్ ఓ ఎన్.సరోజ, ఏ ఎస్ ఓ ఎం.రవిశంకర్, తహసిల్దార్ అప్పారావు, ఎం ఏ ఓ ఆర్ ఎస్ ప్రసాద్, సిబ్బంది, రైతులు, తదితరులు ఉన్నారు.