జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు.

జులై, 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు పిల్లల అక్రమ రవాణా వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి నడవడికపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ పిల్లల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ నెంబర్లు 1098 మరియు 1800 1027 222 గురించి జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిపిఓ ఎ.రామనాథరెడ్డి, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్(CRAF) డిస్టిక్ కోఆర్డినేటర్ ఆర్.శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి డిఈఓ ఇ.నారాయణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.