జిల్లాలో ఫేజ్ -1 రీసర్వే మే నెలాఖరి నాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రీ సర్వే, పి జి ఆర్ ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై గూగుల్ మీ ద్వారా ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అధికారులతో సమీక్షించారు.
రి సర్వేపై సమీక్షిస్తూ జిల్లాలో ఫేజ్ -1 లో ఉన్న గ్రామాలలో రీసర్వే మే నెలాఖరి నాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. అలానే ఫేజ్ 2 రిసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.
పి జి ఆర్ ఎస్ దరఖాస్తులపై సమీక్షిస్తూ రెవిన్యూకు సంబంధించిన పిటిషన్లు పరిష్కరించే సమయంలో అవగాహనతో పరిశీలించి నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. పిజిఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందని తద్వారా సమస్యలు నాణ్యతతో పరిష్కరించుకోవచ్చని అన్నారు.
జిల్లాలో అందరికీ ఇళ్ళు పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించేందుకు మార్గదర్శకాలతో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని అన్నారు. అర్హత గల లబ్ధిదారులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ సర్వే అధికారి కె .శ్రీనివాస్, కలెక్టరేట్ సూపర్డెంట్ సి హెచ్ రవికుమార్, డిప్యూటీ తహాసిల్దార్ ఎం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.