జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది–జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
ఇప్పటి వరకు 37 వేల మంది రైతుల నుండి 2.40 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..
ధాన్యం కొనుగోళ్లులో ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెం.8121676653
తూకం 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పట్టాలి.. అలాకాదని తేమసాకుతో 41 లేదా 42 కేజీలు పడితే చర్యలు తప్పవ్..
ధాన్యం కొనుగోళ్లులో రైతులు ఇబ్బందుల పరిష్కారానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ లు ఏర్పాటు
90 వేల గన్ని బ్యాగులు ఆర్.ఎస్.కె లలో సిద్ధంగా ఉంచాం
ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు రెండు లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్లు నగదు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి అని తెలిపారు. ఇంకా రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్ని బ్యాగులను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్ లతో ఒక కిక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీములు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లల వద్ద దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉంటే కిక్ రెస్పాన్స్ టీం లను సంప్రదించాలన్నారు. వీరి ఫోన్ నెంబర్లు ప్రతి రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. అలాగే కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందని, దీనిలో 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. మిల్లర్ లతో ఇబ్బంది వున్న, రైతు సేవ కేంద్రాల్లో సిబ్బంది స్పందించకపోయినా వెంటనే ఫోన్ చేస్తే కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. తేమశాతం ఎక్కువగా ఉంది, దాన్యం సరిగా లేదు, నాణ్యత లేదు అని చెప్పిన ఎవరి మాట వినవద్దు అని, రైతు సేవా కేంద్రాలను మాత్రమే సంపాదించాలన్నారు. అక్కడ కూడా సిబ్బంది స్పందించకపోతే కిక్ రెస్పాన్స్ టీంనుగానీ, కంట్రోల్ రూమ్ నెం.8121676653 గాని సంప్రదించాలని సూచించారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, దళారులనీ ఆశ్రయించవలసిన అవసరం లేదని, రైస్ మిల్లరులు ఇబ్బంది పెట్టినా మా దృష్టి తీసుకురావాలన్నారు. 40 కేజీలు 600 గ్రాములు మాత్రమే తూకం పట్టాలని, తేమ శాతం సాకుగా చూపించి 41 కేజీలు లేదా 42 కేజీలు పట్టే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులందరూ తూచా తప్పకుండా సూచనలు పాటిస్తూ మద్దతు ధరలు పొందాలని ప్రభుత్వం తరఫున రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు టీమ్ లు సిద్ధంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.