Close

జిల్లాలో జనవరి 6 నుండి మంచానికి, వీల్ చైర్ కి పరిమితమైన పింఛనుదారుల తనిఖీలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 06/01/2025

జిల్లాలో 1,510 మంది పెన్షనర్లు రూ.15,000/- లు చొప్పున పింఛన్ ను అందుకుంటున్నారని, వీరందరూ మంచానికే పరిమితమై లేదా విల్ చైర్ క్యాటగిరిలో పింఛన్లు పొందడం జరుగుతుందని, ఇటువంటి వారిని వారి ఇంటి వద్దనే షెడ్యూల్ ప్రకారం జనవరి 6 నుండి జనవరి 31 వరకు వెరిఫికేషన్ చెయ్యండి జరుగుతుందని తెలిపారు. వీరికి ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్ ల కార్యాలయాల నుండి ముందుగా ఇంటిమేషన్ లెటర్స ను అందజేయడం జరుగుతుందన్నారు. పింఛన్ల తనిఖీ నిమిత్తం జిల్లాలో డివిజన్ ఒక్కొక్క టీం చొప్పున 3 టీమ్స్ లను రాష్ట్ర స్థాయి నుండి కేటాయించడం జరిగిందన్నారు. ఈ టీమ్స్ మండల రూట్ మ్యాప్ ప్రకారం వెరిఫికేషన్ చేసి డేటా యాప్ నందు టీమ్ ల వారిగా డేటాను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి టీమ్ లో ఒక జనరల్ డాక్టర్, ఒక ఆర్థోపెడిషన్, డిఎ ఉంటారని తెలిపారు. వారితో పాటు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి అనుసరిస్తారని అన్నారు.