Close

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/01/2025
2

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పామర్రు-దిగమర్రు నేషనల్ హైవే-165 భూ సేకరణలో భాగంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన భూములకు సంబంధించి భూసేకరణ అధికారి మరియు భీమవరం ఆర్డీవో తయారుచేసిన అవార్డులపై నేషనల్ హైవే అథారిటీ ఫైల్ చేసిన ఆర్బిట్రేషన్ పై ఎన్.హెచ్ అధికారులతో, భూ యజమానులతో విచారణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో భూ యజమానులకు పరిహారం అందజేసే విషయంలో అభ్యంతరాలను నమోదు చేయడం జరిగింది. భూ సేకరణ నిర్వహిస్తున్న మూడు గ్రామాలలో భూమికి సంబంధించిన కొలతలు, భూ యజమానుల పేర్లు తప్పొప్పుల సవరణ ఫిర్యాదుల స్వీకరణకు ఒక తేదీని ఖరారు చేసి సంబంధిత భూ యజమానులు, నేషనల్ హైవే అధికారులతో గ్రామసభలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్, నేషనల్ హైవే-165 ఏఈ ఖాజా, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.