Close

జిల్లాలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్చతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు .

Publish Date : 16/09/2024

దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్చతాహి సేవా కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్ గా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్చతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17 న ప్రారంభోత్సవం ఉంటుందని,18 నుండి అక్టోబర్ 1 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వచ్చతాహి భగీదరిలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్కను నాటడం, మెప్మా, డ్వాక్రా, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక స్వచ్చతా కార్యక్రమాల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్, నీటిని ఆదా ప్లాస్టిక్ నిరోధం, తాగు నీటిని క్లోరినేషట్ చేయడం, ఆరోగ్యకరమైన జీవితం, తదితర అంశాల పై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పార్క్ లలో గ్రామలో సేల్ఫీ పాయింట్ లను ఏర్పాటు చేయడం, సాలిడ్ వేస్ట్ భవనాలకు పెయింటింగ్ చేయడం, అన్ని విద్యా సంస్థలలో స్వచ్చతా ప్రతిజ్ఞ చేయించడం స్వచ్చ పంచాయత్, వార్డ్ లలో పోటీలు నిర్వహించడం ర్యాలీలు, మానవ హారం నిర్వహించడం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడం, పర్యావరణ అనుకూలమైన వస్తువుల తయారీపై పాఠశాల విద్యార్థులకు నిపుణుల చేత వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు తయారుచేసిన వస్తువులను గాంధీ జయంతి రోజున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసినవారికి నగదు బహుమతులు అందిస్తామన్నారు. సంపూర్ణ స్వచ్చతా – స్వచ్చతా లక్షిత్ కార్యక్రమం లో భాగంగా నీటి నిల్వలు ఉన్న చోట్లను గుర్తించి బ్లీచింగ్ చల్లడం, ఘన వ్యర్ధాలను తరలించడం, పార్కుల, డ్రైనేజ్, రహదారుల, విద్యా సంస్థల , వాణిజ్య సముదాయాల క్లీనింగ్, పబ్లిక్ స్థలాల్లో సుందరీకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సఫాయి మిత్ర సురక్ష శివిర్ కార్యక్రమం లో భాగంగా వైద్య ఆరోగ్య సేవలు, పారిశుధ్య పని వారిని గుర్తించి పిపిఈ కిట్లను అందించడం, ప్రభుత్వ పధకాలను అందించడం, లబ్దిదారుని ఆయా పధకాలకు మాపింగ్ చేయడం, మొబైల్ హెల్త్ క్యాంపు ల నిర్వహణ, సఫాయి మిత్ర లకు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బాలల సురక్షా కార్యక్రమాలు, వాక్సినేషన్ డ్రైవ్, పోషకాహార పంపిణీ, హెల్త్ ఇన్సురెన్సు నమోదుకు సహకారం, స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్స్ , చివరిగా సన్మాన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమాలు మూడు రకాలుగా అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో, నియోజకవర్గం పరిధిలో జరుగుతాయని, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్చ భారత్ దివాస్ ఉత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయని, ఈకార్యక్రమాలను ప్రణాళిక ప్రకారంగా నిర్వహించి విజయవంతం తెలిపారు.