Close

జిల్లాలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 21/01/2026

కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,32,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 65,704 ఎకరాలు ఆక్వా సాగు అప్సడలో రిజిస్ట్రేషన్ జరిగిందని, 39,816 ఎకరాలు అప్సడలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం అప్సడలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ కారణాల దృష్ట్యా 25, 315 ఎకరాల రిజిస్ట్రేషన్ కు అవకాశం లేదన్నారు. ఆక్వాకల్చర్ చెరువులు, రొయ్యల సాగు రైతులు అందరూ వెంటనే అప్సడలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధ అనుమతి, ప్రభుత్వ పథకాల లబ్ధి, వివాదాల నివారణ వంటి ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ తెలిపారు. అప్సడ రిజిస్ట్రేషన్ పై డైరెక్టర్లు కూడా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా అప్సడలో జిల్లాకు సంబంధించి నూతనంగా నియమించబడిన డైరెక్టర్లు వేగేసిన సత్యనారాయణ రాజు, రాసమళ్ల వీరయ్య, సాయి మనోహర రాజు, రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.రామరాజులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దుస్సాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు.

తొలుత స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు 2026 క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్, సహాయ సంచాలకులు ఎల్ఎల్ రాజు ప్రసాద్, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, ఎంపీడీవోలు, ఎఫ్ డి ఓ లు, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.