జనవరి 31న నిర్వహించనున్న డి.ఆర్.సి సమావేశానికి అన్ని అంశాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీఆర్సీ) ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డిఆర్సి సమావేశాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశానికి హాజరయ్యే ముఖ్య అతిథులకు ప్రోటోకాల్ ఏర్పాటు, సమావేశంలో జిల్లా అధికారులతో చర్చించే అంశాలపై సన్నద్ధత, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందరి సమన్వయంతో డిఆర్సి సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.