Close

చేనేత వస్త్రాలు మన్నికలో, నాణ్యతలో మేటిగా ఉంటాయని, ఆరోగ్యవంతమైన చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Publish Date : 01/04/2025

మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు అన్ని స్టాల్స్ ను సందర్శించి వాటి తయారీ, మన్నిక, ప్రాంతం, ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో చేనేతదారులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు ఒక చీరను కొనుగోలు చేసి రూ.8 వేలు నగదును చెల్లించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనంతో పాటు, మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొట్టమొదటిగా పెద్ద ఎత్తున చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రజలందరూ ప్రదర్శన తిలకించి, వస్త్రాలను కొనుగోలు చేసే చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు.
ఈ ప్రదర్శన ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుందని, ఉదయం 10:00 నుండి రాత్రి 9:00 వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 మంది చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ – 39, తెలంగాణ – 6, బీహార్ – 4, వెస్ట్ బెంగాల్ – 3, ఉత్తరప్రదేశ్ -2, మధ్యప్రదేశ్ -2, జమ్మూ అండ్ కాశ్మీర్ – 3, జార్ఖండ్ – 1 మొత్తం 60 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,77,447 నేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని చేనేత పరిశ్రమ తరతరాలుగా అభివృద్ధి చెంది గొప్ప సాంస్కృతికంగా వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని 35 చేనేత రకాల ఉత్పత్తులను ఓడిఓపి ఉత్పత్తులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఉప్పాడ జమధాని చీరలు, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, సిల్క్ చీరలు మరియు పావడలు భౌగోళిక గుర్తింపు పొందాయన్నారు. ఇవి ఈ ప్రాంతం యొక్క సంస్కృతిక, కళాత్మక సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వివిధ జిల్లాల చేసేత మరియు పట్టు వస్త్రాలతో, కాటన్, మెర్సిడై జెడి, సికో చీరలు, పొందూరు ఖాది చీరలు & షర్టింగ్, విజయనగరం లుంగీలు, టెడ్ పిట్లు, అనకాపల్లి సిల్క్ చీరలు, కోనసీమ కాటన్ చీరలు ఇప్పాడ జందాని చీరలు, ఏలూరు కార్పెట్లు, పడన కలంకారి చీరలు, బందరు చీరలు, మంగళగిరి కాటన్ చీరలు డ్రస్ మెటీరియల్, లుంగీలు, టెడ్ పిట్లు, కుప్పడం చీరలు & డ్రస్ మెటీరియల్, వెంకటగిరి కాటన్ సిల్క్ చీరలు, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ చీరలు, ధర్మవరం సిల్క్, ఎమ్మిగనూరు టెడ్ పిట్లు, కోడుమూరు గద్వాల చీరలు, ఉరవకొండ సిల్క్ చీరలు, వంటి వివిధ రకాల వస్త్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో లోని ప్రసిద్ధిగాంచిన వస్త్రాలు మరియు మన రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి గద్వాల్, నారాయణపేట చీరలు, పోచంపల్లి, కాశ్మీర్, చందేరి, బెంగాల్ చీరలు స్టాల్స్ అందుబాటులో ఉంటాయి.

భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని ప్రాంతాల చేనేతలను ఒకే చోట పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన పురాతన సాంప్రదాయ చేనేత కళాకృతులను మరియు హస్తకళా ఉత్పత్తులను ప్రత్యక్షంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని శాసనసభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ పరిశ్రమకు అనుసంధానించబడిన వివిధ సంస్థలతో కలిసి పని చేస్తోందని, వారికి నిరంతర పనిని అందించడానికి వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి మరియు వాటి ప్రచారానికి అవసరమైన చర్యలను తీసుకుంటోందని శాసనసభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ కె.కన్నబాబు,
జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

3.113.223.33