• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

గ్రంధి షణ్ముఖ్ ను అభినందించిన జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

Publish Date : 12/09/2024

గురువారం జిల్లా కలెక్టరు ఛాంబరు నందు జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి కి, ప్రభుత్వ మాజీ విఫ్ గ్రంధి శ్రీనివాస్ మనుమడు గ్రంధి షణ్ముఖ్ విజయవాడ ముంపు బాధిత ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా రూ.20,850 చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విజయ వాడలో కొన్ని డివిజన్లు అతలాకుతలమై ఆ ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి తాము సైతం అంటూ చిన్నారులు కూడా ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిదాయమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యా సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వంతో విజయవాడ ముంపు బాధితులను ఆదుకుంటున్నారన్నారు. రెండవ తరగతి చదువుతున్న గ్రంధి షణ్ముఖ్ తన వంతు సాయంగా బంధువులు నుండి, తన పాకెట్ మని దాతృతంగా ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా చిన్నారి గ్రంథి షణ్ముఖ్‌ను జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అభినందించి, ఆశీర్వదించారు.