గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి–రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
గోదావరి పుష్కరాలు, కొల్లేరు గ్రామాల సరిహద్దుల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణ, తదిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తొలుత సిఎస్ మాట్లాడుతూ జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఆయా శాఖలు, గోదావరి పుష్కరాల సహ్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఇది మొదటి ప్రాధమిక సమావేశం కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా స్నాన ఘట్టాలను గుర్తించడం, తాగునీరు, పారిశుద్ధ్యం,రవాణా,వైద్య శిబిరాలు, భద్రత, జనసమూహ నిర్వహణ,ట్రాఫిక్ నిర్వహణ,అత్యవసర సేవల సమన్వయం చేయడం వంటి అంశాలపై వివరణాత్మక డిపిఆర్ లను సిద్ధం చేసి పంపడం వంటి చర్యలు చేపట్టాలని కలక్టర్లను ఆదేశిచారు. మన రాష్ట్రంలో గోదావరి నది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి,అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీదగా ప్రవహిస్తుందని ఈ ఆరు జిల్లాల్లో వివిధ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేదుంకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ అన్నారు.
కొల్లేరు పై సమీక్ష చేస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యంలో ఆకివీడు మండలంలో 10 గ్రామాలు ఉన్నాయని, 5 గ్రామాల సరిహద్దులను గుర్తించడం జరిగిందని, మరో 5 గ్రామాలు సరిహద్దులను సర్వే సత్వరమే పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో ఒక టీమును ఏర్పాటు చేసి కొల్లేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చట్ట విరుద్ధంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులను గుర్తించి సర్వే ప్రక్రియను మూడు వారాలలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డిఓ కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.