గురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పారిశుధ్యం, పింక్ టాయిలెట్స్, ప్లాస్టిక్ నిర్మూలన, చలి వేంద్రాలు ఏర్పాటు పై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు.

పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పారిశుధ్యం నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పింక్ టాయిలెట్స్ నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలన్నారు. మురుగు కాలువలు క్లీన్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వర్షాకాలంలో ఎక్కువగా నీట మునిగే ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. ఆక్రమణలో ఉంటే తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో కొబ్బరి బొండాలు, తాటి ముంజులు, జ్యూస్ షాపులు ఉండే ప్రాంతాలను గుర్తించి వారు వాడి పారవేసే చెత్తను ఎక్కడ వేస్తున్నారు తెలుసుకోవాలని అన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాత్రి సమయాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుధ్యం నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగించే షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవికాలం సందర్భంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత నుండి కాపాడుకునేందుకు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన బ్యానర్లను పెట్టాలని అన్నారు. దాతలు సహకారంతో పార్కులు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆహార తినుబండారాలు, హోటల్స్ పై తనిఖీ చేసి నాణ్యత లోపాలు ఏమైనా ఉంటే పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జి వి పి వద్ద సిబ్బందిని పెట్టి పర్యవేక్షణ చేయాలని అన్నారు. పీఎం సూర్య గర్ సోలార్ ప్యానల్ ను ఎంతమంది వినియోగిస్తున్నారు తెలుసుకొని ఎక్కువ శాతం వినియోగదారులు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు భీమవరం రామచంద్రారెడ్డి, తాడేపల్లిగూడెం ఎం ఏసుబాబు, తనుకు టి రామకుమార్, పాలకొల్లు బి విజయ సారథి, నరసాపురం ఎం అంజయ్య, ఆకివీడు జి కృష్ణమోహన్, జిల్లా కలెక్టరేట్ డిప్యూటీ తాసిల్దార్ ఎం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.