Close

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Publish Date : 05/11/2025

బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నాగరిక సమాజంలో ఆడ, మగ తారుతమ్యం లేదని అన్నారు. పురుషుల కంటే దీటుగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు. అనాగరికమైన గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించుకున్న ఉపేక్షించేది లేదని, ఇటువంటి పరీక్షలు చేసినట్లు తెలిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తరచూ స్కానింగ్ సెంటర్ లపై డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా రెండు, మూడు కాన్పుల మహిళల లక్ష్యంగా డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించాలన్నారు. 97 ఫారం-ఎఫ్ రిపోర్టులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. భీమవరం, నరసాపురం డివిజన్లో 30 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జూలై,2025 నుండి అక్టోబర్, 2025 వరకు స్కానింగ్ సెంటర్స్ 178 సాధారణ తనిఖీలను నిర్వహించడం జరిగిందన్నారు. సఈరోజు జరిగే సమావేశంలో నాలుగు నూతన స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటుకు అనుమతించడం జరిగిందన్నారు. అలాగే మూడు స్కానింగ్ సెంటర్స్ రెన్యువల్, ఇంతకుముందే ఏర్పాటుచేసిన నాలుగు స్కానింగ్ సెంటర్లలో మార్పులు చేర్పులకు అనుమతించడం జరిగిందని తెలిపారు. భీమవరంలో డివిజన్లో 81, నరసాపురం డివిజన్లో 80 మొత్తం జిల్లాలో 161 స్కానింగ్ సెంటర్ లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టంపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేందుకు కళాజాతాలు, సినిమా థియేటర్లలో లఘు నిడివి కలిగిన ప్రకటనలు, రైల్వే స్టేషన్లో వాయిస్ అనౌన్స్మెంట్లో ద్వారా చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు కమిటీ మెంబర్స్ సెక్రటరీ డాక్టర్ బి.గీతా బాయి, మెంబర్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎం ఎస్ వి ఎస్ బద్రీరాజ్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ వి ఎస్ ఆర్ కె కుమారి, హెల్త్ సూపర్వైజర్ ఏజే సంధాని పాల్గొన్నారు.