కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ “పశ్చిమగోదావరి జిల్లా” పర్యటన విజయవంతం చేయాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఈనెల 28వ తేదీ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా పెదమైనవానిలంకలో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనున్నారన్నారు. ఈ సందర్భంగా పెదమైనవానిలంక గ్రామంలో శివాలయం వద్ద జరుగుచున్న సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలిస్తారని అనంతరం మనకి బాత్ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. తదుపరి డిజిటల్ భవన్ నందు ఏర్పాటుచేసిన డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతుల ప్రారంభిస్తారన్నారు. వికసిత్ భారత్.. డిజిటల్ ఇండియా ఉద్దేశంగా జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలు, వందేమాతరం పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తారన్నారు. అనంతరం డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. కావున అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
తొలుత రామకృష్ణ మిషన్ రాజమండ్రి వారి సౌజన్యంతో తయారు చేస్తున్న మత్స్యకార బోట్లను, డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, సియోన్ట్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ డిజిటల్ భవన్లో ఏర్పాటుచేసిన ఏఐ పవర్ డ్రోన్ టెక్నాలజీ లాబ్, ఏ ఐ డిజిటల్ అండ్ ఐటీ లీటరసీ ల్యాబ్, ఏ ఐ పవర్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ స్కిల్స్ ల్యాబ్,మనకి బాత్ కార్యక్రమం,సముద్రపు కోత అడ్డుకట్ట పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు..
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సర్పంచ్ సెక్రటరీ మోహన్, డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, డీఈవో ఈ నారాయణ, డీఎస్ఓ అండ్ సరోజ, డి ఆర్ డి ఏ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఎల్ డి ఎం నాగేంద్రప్రసాద్, జిల్లా అగ్ని అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి. అరుణ్ కుమారి, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్.ఇ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఇంజనీర్ సత్యనారాయణ, మత్స్యశాఖ అధికారి ఎల్ఎల్ఎన్ రాజు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.