Close

కాళీపట్నం గ్రామం జమీందారీ భూములు హక్కులు కలిగించే ప్రక్రియలో సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలియజేస్తే వేగవంతమైన పరిష్కారానికి దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు తెలిపారు.

Publish Date : 29/04/2025

సోమవారం కాళీపట్నం జమీందారీ భూములు సెటిల్మెంట్ హక్కులు కొరకు కాళీపట్నం రెవిన్యూ గ్రామ పరిధిలో ఉన్న జగన్నాధపురం, కోమటితిప్ప, పాతపాడు, కాళీపట్నం వెస్ట్, ఈస్ట్ పంచాయితీలు రైతులు సూచనలు సలహాలు అభిప్రాయాలు తెలుసుకునేందుకు జగన్నాధపురం హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళీపట్నం జమీందారీ భూములు 1945 సంవత్సరం కట్ ఆఫ్ తేదీ డాక్యుమెంట్లు కలిగి హక్కులు ఉన్న రైతులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రైతుల సూచనలు, వినపాలను నమోదు చేసుకోవడం జరిగిందని, వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లే, త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తాహసిల్దార్ కె.రాజ్ కిషోర్, డిటి సుగుణ సంధ్య, నర్సాపురం తెలుగుదేశం నియోజకవర్గ అధ్యక్షులు పోత్తూరి రామరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.