ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక
ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఇప్పటికే కాలువలను శుభ్రపరచడం, కాలవగట్లపై ఆక్రమణలను తొలగించడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా పిడబ్ల్యూఎస్ స్కీములకు మైక్రో ఫిల్టర్ లను అమర్చడం ద్వారా మరింత స్వచ్ఛమైన నీటిని అందించగలుగుతామన్నారు. స్వచ్ఛమైన తాగునీరు లేకపోతే ఎన్నో వ్యాధులకు కారణం అవుతుందని, నేడు జెజెఎం నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. దీనికి ప్రతిరోజు 5 లక్షల లీటర్ల నీటిని ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉందని, చిలుకూరి గ్రామంలో ఉన్న 539 గృహాలకు రోజుకి రెండు లక్షల లీటర్లు సరిపోతాయన్నారు. ప్రజలు త్రాగునీటి వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తాగునీటి వనరులు కలుషితం కావడంతో క్యాన్సర్ వంటి రోగాలకు గురవుతున్నారన్నారు. జెజెఎం నిధులతో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు వలన స్వచ్ఛమైన తాగునీటిని గ్రామ ప్రజలు పొందగలుగుతారని, దీనివలన అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా డిఈ టి.శ్రీనివాసరావు, ఏఈ కె హరినాథ్ రాజు, ఎంపీడీవో ఎం వి ఎస్ ఎస్ శ్రీనివాస్, తహసిల్దార్ కే.నాగార్జున, గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, వీఆర్వో సిహెచ్.విజయలక్ష్మి, స్థానిక నాయకులు రుద్దరాజు దుర్గారాజు, ఇందుకూరి నవీన్ వర్మ, చేకూరి శ్రీనివాసరాజు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.