ఈ క్రాప్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

ఉండి మండలం యండగండి గ్రామంలో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఈ క్రాప్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు ఎలా జరుగుతున్నది, మండలంలో ఇప్పటివరకు ఎంత శాతం నమోదు ప్రక్రియ జరిగినది అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 10 వేల 500 ఎకరాలకు గాను 9 వేల ఎకరాల వరకు ఈ క్రాప్ నమోదు పూర్తి చేయటం జరిగినదని జాయింట్ కలెక్టర్ వివరించగా, మిగిలిన 1,500 ఎకరాలు ఈ క్రాప్ నమోదు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు యూరియా ఏ విధంగా మీకు అందుతుంది అడుగగా మాకు ఇబ్బంది ఏమీ లేదు రైతులు అందరికీ సక్రమంగా యూరియా అందుతుందని అన్నారు. ఒక్క ఉండి మండలమునకు 570 టన్నులు యూరియా రావడం జరిగిందని, 480 టన్నులు యూరియాను ఇప్పటికే రైతులకు సరఫరా చేయటం జరిగింది అన్నారు. ఇంకా 90 టన్నులు సొసైటీల్లో ఉంది అన్నారు. యూరియా కొరత ఉందని వదంతులను నమ్మవద్దని ఖరీఫ్ కు సరిపడా యూరియాను సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన మేర అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి నిమ్మల శ్రీనివాస్, ఏఈఓ పరంజ్యోతి, వీఎవోలు ఊర్మిళా, శ్రీనివాసరావు, వీఆర్వో వి ఆర్ ఓ గణపతి, రైతులు తదితరులు ఉన్నారు.