• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం… కష్టాలలో ఉన్న వారికి మనోధైర్యం కల్పించడం కూడా సమాజ సేవే- జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 29/07/2025

పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమ వంతు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.

పి4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సమాజం ద్వారా సంపన్నులుగా ఎదిగిన వారు పేదలను ఆదుకోవడం ద్వారా సమాజ సేవ చేసిన వారు అవుతారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దాలనె ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో సంపన్నులైన ఎంతోమంది రైతులు ఉన్నారని వారు తమ తోటి కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థికంగా వెనకబడి వున్న వారిని గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సహాయం, వైద్య సహాయం, వారి పిల్లలకు విద్యాపరంగా చేయూత అందించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతి సచివాలయంలో శిక్షణ పొందిన టెక్నికల్ సహాయకులు ఉన్నారని వారి ద్వారా మార్గదర్శిగా నమోదయి బంగారు కుటుంబాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు స్థానికంగా సమావేశాలు నిర్వహించి రైతులకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎంతోమంది దాతలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారినందరిని గుర్తించి వారిని కలిసి పి.4 పై అవగాహన కల్పించి మార్గదర్శ కులుగా నమోదయ్యే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి4లొ అందరూ భాగస్వాములై పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, వ్యవసాయ రంగం నుండి పెద్ద ఎత్తున మార్గదర్శకులుగా నమోదై బంగారు కుటుంబాలకు అండగా నిలవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.