Close

ఆధునిక కవిగా ప్రజలలో భక్తి సామాజిక బాధ్యత సమనాత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 09/11/2025

శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడు

ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆధునిక కవి స్వరకర్త, సంగీత కారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించటం జరుగుచున్నదన్నారు. శ్రీకృష్ణ భగవానునికి కనకదాసు గొప్ప భక్తుడని ఆధునిక కవిగా ప్రజలలో భక్తి సామాజిక బాధ్యత సంవత్సరం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు ఆ మహనీయుడు మార్గం సదా ఆచరణీయమని అన్నారు. శ్రీకృష్ణుడికి గొప్ప భక్తునిగా ఉండేవారని, ఆయన కర్ణాటకలోని గొప్ప భక్తుడు, సంగీత కారుడు, స్వరకర్త, సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు వలన బాగా పాచుర్యం పొందారన్నారు. పూజారులు కనకదాసు కు శ్రీకృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించగా గుడి బయట కూర్చుని భక్తి తార వశయముతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశారని, ఈ విధముగా కొన్ని వారాల పాటు గుడి బయటనే సొంతంగా వంట వండుకుని తింటూ కాలం గడిపినట్లు చరిత్ర చెబుతుంది అన్నారు. అప్పుడు గుడి గోడ పడిపోయి స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది గుడి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీకి ఒక పగులు ఏర్పడి ఆ పగులుకుండా కనకదాసు స్వామిని దర్శించుకున్నాడని ఈ కారణంగానే దేవాలయం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖముగా ఉంటుందని అన్నారు. ఆయన సైనికునిగా పనిచేసేవారని వృత్తిని విడిచి పెట్టి తత్వ జ్ఞానాన్ని ఆయన రచించిన కీర్తనలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేసేరని వాటి ప్రాముఖ్యత తెలిసేలా ప్రజలలోకి తీసుకు వెళ్ళటం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.

ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ శ్రీ కనకదాసు వంటి మహానుభావులు జీవిత విశేషాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.