• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Publish Date : 11/08/2025

పిజిఆర్ఎస్ వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకంజలో ఉండడంపై సంబంధిత శాఖల అధికారులపై ఆగ్రహం …

ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు

*పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కావున పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే మంచి పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

ఈరోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ ద్వారా 180 అర్జీలను స్వీకరించడం జరిగింది. వీటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@ అత్తిలి మండలం, ఆరవల్లి గ్రామానికి చెందిన నల్లిమిల్లి సుబ్బిరెడ్డి అర్జీని సమర్పిస్తూ, తాను వికలాంగుడునని తన పెద్ద కుమారుడు నన్ను సరిగా చూడటం లేదని, ప్రాణభయంగా ఉందని, ఆస్తి పంచమని బెదిరిస్తూ ఇంటి నుండి వెళ్లిపొమ్మంటున్నాడన్నారు. దయచేసి నన్ను ఇంటిలో ఉండే విధంగా అధికారులు న్యాయం చేయాలని కోరారు.

@ నర్సాపురం మండలం, పెదలంక గ్రామానికి చెందిన కవురు గంగారత్నం అర్జీని సమర్పిస్తూ, తనకు పెదలంక గ్రామంలో 70 సెంట్లు భూమి ఉందని ఇటీవల చేసిన రీ సర్వేలో 6 సెంట్లు భూమి తగ్గిందని దయచేసి తిరిగి రీసర్వె చేసి మా భూమికి హద్దులు నిర్ణయించి న్యాయం చేయాలని కోరారు.

@ యలమంచిలి గ్రామానికి చెందిన తోటే సూర్యనారాయణ అర్జీ సమర్పిస్తూ, తాను రోజు కూలి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, 2015 సంవత్సరంలో బిల్డింగులో పనిచేస్తున్న సందర్భంలో కరెంటు షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయానని, భార్యా పిల్లలతో జీవనం దుర్భరంగా ఉందని, దయచేసి 15 వేల రూపాయల పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

@ పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామానికి చెందిన నామన నాగేశ్వరమ్మ అర్జీని సమర్పిస్తూ, తనకు నలుగురు కుమారులని 3వ, 4వ కుమారులు నన్ను ఇంటిలో ఉండనివ్వడం లేదని, సమస్య పరిష్కారం కోసం స్పందనలో ఫిర్యాదు చేయగా పరిష్కారం చూపకుండా నాచేత వేలిముద్ర వేయించుకున్నారని, దయచేసి నా కుమారుల నుండి నాకు రక్షణ కల్పించాలని కోరారు.

@ తూర్పు విప్పరు గ్రామానికి చెందిన కడలి గోగులమ్మ తనకు ఏ ఆధారం లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని తనకు 35 కేజీల బియ్యం కార్డు మంజూరు చేయాలని అర్జీని ఇచ్చారు.

@ భీమవరం దుర్గాపురం 38వ వార్డుకు చెందిన సాకేటి సరోజిని వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని అర్జీ ఇచ్చారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.