• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

అధిక పోషక విలువలు కలిగిన గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్ వినియోగానికి రైతుల ముందుకు రావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 28/07/2025

జిల్లాలోని 20 మండలాల్లో 60 ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి..

రైతులు ఎరువులు వినియోగం తగ్గించి, గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ ను వినియోగించాలి…

ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి గ్రూప్ ల ద్వారా గుర్రపు డెక్క వర్మి కంపోస్ట్ తయారీ.

జిల్లాలోని సాగు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన గుర్రపు డెక్కన్ తొలగించి రైతులకు మేలు చేసేలా వర్మీ కంపోస్ట్ ను తయారు చేసేందుకు సంబంధిత అధికారుల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ తయారీకి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇప్పటికే గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ ను తయారుచేసి అమ్మకాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గత రెండు మాసాలుగా చేపట్టిన చర్యలలో భాగంగా నేటికీ ఫలితాలను చూడగలిగామన్నారు. గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, చెత్త ద్వారా వర్మి కంపోస్టు తయారీ కంటే సులువైనదని, అధిక పోషక విలువలు కలిగిందని అన్నారు. కాలువలు, డ్రెయిన్లు ద్వారా సేకరించిన గుర్రపు డెక్కన్ ఎస్ హెచ్ జి మహిళల ద్వారా చాప్ కట్టర్స్ ద్వారా కట్ చేసి ఒక వరుస గుర్రపు డెక్క, దానిపైన పేడ, మరో వరుస గుర్రపు డెక్క ఇలా లేయర్లుగా ప్రాసెస్ చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని తిప్పుకోవాలని, సుమారు 45 రోజుల నుండి 60 రోజులు మధ్య 8 నుండి 10 టన్నుల వర్మీ కంపోస్ట్ తయారవుతుందన్నారు. ఈ పనిని ఎస్ హెచ్ జి లకు అప్పజెప్పడం ద్వారా 30 నుండి 40 రోజుల వరకు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 60 ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ల ఏర్పాటుకు డిపిఓ, వ్యవసాయ శాఖ, డ్వామా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని
ఈ ప్రాజెక్టును డివిజన్, మండల స్థాయి అధికారులు విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. వీటిలో అత్యధిక న్యూట్రియెంట్ విలువలు కలిగి ఉంటాయన్న విషయం ఇప్పటికే ప్రయోగాత్మకంగా రుజువయిందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా కల్చర్ రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

జూన్ కాన్ఫరెన్స్ లో డిఆర్డిఎ పిడి ఎమ్.ఎస్.ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, డిపిఓ ఎ.రామనాథ్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి నాగలింగాచార్యులు, డ్వామా, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీ, మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.