అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, యాక్షన్ చేయాలి, వీధులను శుభ్రంగా ఉంచాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ఆక్రమణలు తొలగింపు విషయములలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
భీమవరం పట్టణంలో వీరమ్మ పార్కు రైతు బజార్, , కొత్త బస్ స్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశం చౌక్, జేపీ రోడ్డు, ప్రాంతాల లో ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,
రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో కలసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుధ్యం, కూరగాయల ధరలు నియంత్రణ విషయములలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పట్టణంలో ఉన్న వీరమ్మ పార్క్ అంతా కలియతిరిగే పరిశీలించారు. పార్కు లోపల లైటింగ్ పెట్టి ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కు లోపల ఫుడ్ కోర్టును పరిశీలించి వ్యాపారం ఎలా జరుగుచున్నది ఇంకా బాగా అభివృద్ధి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు పని చేసే సమయంలో బ్లౌజులు, మాస్కులు, ధరించాలని సూచించారు.
కొత్త బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు మీదకు షెడ్డులు నిర్మించి ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రైల్వే జంక్షన్ ఫ్లై ఓవర్ వద్ద డంపింగ్ చేస్తున్న చెత్త నంతా తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ గా చేయాలని ఆదేశించారు. ప్రకాశం చౌక్ వద్ద పెద్దపేట ప్రాంతంలో తొలగించిన ఆక్రమణలు ప్రాంతమంతా క్లీన్ చేసి పార్కుల అభివృద్ధి చేయాలని అన్నారు. చికెన్ షాపులు వ్యర్ధాలు పాడేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జువ్వలపాలెం రోడ్డు రాయలం డ్రైన్ రోడ్డు ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు పరిశీలించారు. రైతు బజారు అంతా తిరిగి పరిశీలించారు. కూరగాయల ధరలు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు రేట్లు తెలిపే బోర్డ్స్ ప్రతి షాప్ వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులును ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు . పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ ఆక్రమణ తొలగింపు నాకు స్థానిక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇందులో భాగంగా చెత్త సేకరణ శుభ్రత తడి చెత్త పొడి చెత్త వేరు వేరు గా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని అన్నారు. పారిశుద్ధ్యని కి కలిగించే ఆ క్రమంలో వెంటనే తొలగించాలని వీధులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో కె .ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం రామచంద్రారెడ్డి, ఏసి పి ఎం శ్రీలక్ష్మి, టౌన్ సర్వే ఎస్ రమబాయి, శానిటేషన్ వర్కర్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు.