అక్టోబర్ 27న తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలనీలో ఖరీఫ్ సీజన్ కు తొలి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం–జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
శుక్రవారం తాడేపల్లిగూడెం ఆరుగొలను రైతు సేవా కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ఏర్పాటుపై సిబ్బందితో సమీక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్లు, సొసైటీ స్టాప్ తో మాట్లాడి శిక్షణ తరగతులు పూర్తయినవి లేనివి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రాల గురించి అధికారులతో చర్చించారు. ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు తెలిసే విధంగా వివరాలను డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు సంబంధించిన లావాదేవీలు, స్టాక్ రిజిస్టర్లు నిర్వహణ సంబంధించినవి పగడ్బందీగా ఉండాలని అన్నారు. రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలన్నారు. తేమశాతం తెలిపే యంత్రాన్ని పరిశీలించారు.
అనంతరం తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు
ఆర్డీవో ఛాంబర్ లో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు ఈనెల 27వ తేదీ సోమవారం ఆరుగోలను రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆర్ఎస్కేలో 50 శాతం గోనెసంచులు ఉండేలా చూడాలన్నారు. గోదాములలో సంచులను అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు వద్దనుండి ధాన్యం సేకరించడంలో ఎటువంటి అసౌకర్యము లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, ఏ ఎస్ ఓ ఎం.రవిశంకర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.గంగాధర్, ఎంఏఓ నారాయణరావు, తహసిల్దార్ ఎం.సునీల్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు, ఎం ఎల్ ఓ లక్ష్మీకాంతం, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆర్ఎస్కే సిబ్బంది, తదితరులు ఉన్నారు.