ముగించు

పాపికొండలు

వర్గం ఇతర

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి). ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.

పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం.
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • కొల్లూరు వెదురు కుటీరాలు
  • గోదావరి నది
  • పాపికొండలు

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

రాజధాని విమానాశ్రయం తిరుత్తణికి సమీప విమానాశ్రయం. జెట్ ఎయిర్వేస్ మరియు స్పైస్జెట్ రెగ్యులర్ సర్వీసెస్ అందిస్తున్నాయి. వారు చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్ మరియు విజయవాడ నుండి విమానాలను నడుపుతున్నారు.

రైలులో

పాపి కొండలకు రైల్వే స్టేషన్ లేదు; సమీప రైల్వే స్టేషన్ రాజమండ్రి స్టేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి. దేశం యొక్క వివిధ ప్రాంతాలలో అనేక రైళ్ళు ఉన్నాయి. ఇది విజయవాడ నుండి 150 కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి 220 కిలోమీటర్లు.

రోడ్డు ద్వారా

మీరు ఖమ్మం జిల్లా నుండి ప్రయాణిస్తుంటే, మీరు బస్ లేదా బస్సులను కోట చేరుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుండి రాజమండ్రి కి టాక్సీలో చేరవచ్చు. తూర్పు గోదావరి నుండి పాపి కొండల శ్రేణికి 35 కిలోమీటర్ల రహదారి ఉంది.