ముగించు

జిల్లా పంచాయతీ కార్యాలయం

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామా పంచాయతిల ముఖ చిత్రం :-

వీలిన మండలాలును కలుపుకొని 48 మండలాలు 881 గ్రామా పంచాయతిలు కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా .

గ్రామీణ ప్రజానీకానికి పౌర సదుపాయాలు కల్పనే ముఖ్య లక్ష్యంగా పంచాయతి రాజ్ శాఖ పనిచేస్తుంది.

పౌర సదుపాయాలు :-

పారిశుధ్యం, మంచినీటి / త్రాగునీటి సరఫరా , వీధి దీపాలు వంటి సదుపాయాలతో పాటు నిధుల లభ్యతకు తగ్గట్టుగా గ్రామం లోపల గ్రామం చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ శాఖ నిర్వర్తిస్తుంది. ఇవే కాకుండా జిల్లా పరిపాలన యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పగించే యన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణి వంటి సామాజిక భద్రత పధకాల అమలు, ఐ యస్ ఎల్ నిర్మాణంలో పాలు పంచుకోవడం వంటి భాద్యతలను ఈ శాఖ నెరవేరుస్తుంది.

గ్రామపంచాయతీల ఆదాయ వనరులు

ఇళ్ళ పన్నులు, చేపల చెరువు లీజులు, వీధి మరియు సంత లా నుండి వచ్చే కిస్తీలు, ఆసీళ్లు , కట్టడాల మరియు స్థలముల పై వసూలు చేసే రుసుములు, కబేళ ల నుండి వచ్చే పనులు గ్రామపంచాయతీలకు ఆదాయన్ని సమకూర్చే వనరులు

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం 14 వ ఆర్ధిక సంఘం వారు జారి చేసిన దిశా నిర్దేశాలకు అనుగుణంగా నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేస్తూ వస్తుంది.
2002 లో ప్రభుత్వం పంచాయతి కార్యదర్శి వ్యవస్థను ప్రవేశపెట్టింది. వారి విధి నిర్వహణ జాబితాను జి వో ఎం యస్ నెం 295 పి ఆర్ & ఆర్ ఓ 2007 నందు రూపొందించబడింది. పంచాయతి కార్యదర్శి పై తదుపరి ఉన్నతాధికారి ఎక్స్టెన్షన్ అధికారి పి ఆర్ & ఆర్ డి , చట్టాలు అందలి నియమ నిబంధనల కనుగుణంగా గ్రామపంచాయతీల పాలన జరిగేలా ఆయన చూసుకోవాల్సిఉంటుంది. ఈ అధికారి క్రమానుగత శ్రేణిలో తదుపరి పై అధికారి డివిజనల్ పంచాయతి అధికారి వారి పైన జిల్లా పంచాయతి అధికారి

ఈ అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో గ్రామపంచాయతీల నిర్వహణ తీరుతెన్నులను తనిఖి చేస్తూ గ్రమపంచాయాతిల పాలనా సక్రమంగా సాగేటట్లు చూస్తూ ఉంటారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జన సామాన్యానికి పారిశుధ్యం, మంచినీటి / త్రాగునీటి సరఫరా , వీధి దీపాలు వంటి సదుపాయాలు కల్పించటానికి గ్రామపంచాయతీల ఆదాయ వనరులు పెంచుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుక్కను గ్రామపంచాయతీలు నీటి పారుదల పన్నుని , వీధి దీపాల పన్ను మరియు గ్రామా సరిహద్దులో నిలిపిన ప్రకటన బోర్డు లపై ప్రచార పన్ను విధించాల్సి ఉంది.