ముగించు

పర్యాటకం

gokula parijatha giri temple1.గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రము, జంగారెడ్డిగూడెం:

పూర్వము చిట్టియ్య గారు అనే భక్తునికి శ్రీ వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామము ఉత్తరము వైపున గల కొండలలో తన పాదములు వెలుస్తాయని ఆ ప్రదేశములో ఆలయము నిర్మంపమని భక్తుల ఆణిష్టములు నేరవేర్చుదునని భగవంతుడు తెలుపగా ఆ ప్రకారము అన్వేషించగా జంగారెడ్డిగూడెం ఉత్తర వైపున వరుసగా గల 7 కొండలలో 6వ కొండపై స్వతః సుద్దంగా పెరుగుచున్న పారిజాత వృక్షము క్రింద స్వామివారి పాదములు కల శిల ను గుర్తించి ఆ ప్రదేశములో చిన్న మందిరమును నిర్మంచి శ్రీ వేంకటేశ్వరుని శిల్పమును నెలకొల్పినారు.  భక్తుల కోర్కెలు నెరవేర్చుచూ స్వామి అనతికాలంలో ప్రసిద్ధినొందినాడు.  2003 సంవత్సరంలో శ్రీ పేరిచర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యములో అభివృద్ధి కమిటి ఏర్పాడి భక్తుల సహకారంతో ప్రస్తుత, అమ్దమైన ఆలయము నిర్మించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి పర్యవేక్షణలో శ్రీవైఖానస ఆగమయుక్తంగా స్వామి వారి పాదాలు వెలసిన ప్రదేశములో ప్రస్తుత విగ్రహము ప్రతిష్టించినారు, పాడి పంటలు కలిగిన ప్రదేశము కావున గోకుల మని పారిజాత వృక్షములు కల కొండ కావున పారిజాతగిరి అని వేంకటేశ్వరుడు గల క్షేత్రము కావున తిరుమల అని గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రముగా ప్రసిద్ధి పొందినది.      

2.శ్రీ భూనీళా సమేత శ్రీ జనార్ధనస్వామి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం, ఏలూరు:

ఈ సృష్టికి మూలమైన జగన్మాత త్రిమూర్తులను సృష్టి౦చి తనను పరిణయమాడవలెనని కోరగా, అందుకు బ్రహ్మ, విష్ణువులు అంగీకరించకపోవుటచే శంకరున్ని కోరగా మూడవనేత్రమును, తనశక్తులను తన వశము చేసినచో అందుకు అంగీకరించెదనని తెలిపెను.  ఆ మాటలకు జగన్మాత అంగీకరించి తన శక్తులతో పాటు మూడవనేత్రమును శంకరుని వశము చేసినంతనే శంకరుడు జగన్మాతను భస్మము చేసేనట. అంతట ఆ భస్మమును నాలుగు భాగములు చేసి మూడు భాగములను, లక్ష్మీదేవి, పార్వతిగా తాను పొందిన శక్తీ ప్రభావముచే సృష్టి౦చెను.  మిగిలిన నాల్గవ భాగమును మరలా 101 భాగములుగా చేసి వాటికి ప్రాణం పోసి లోకరక్షణకై ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క దేవత గ్రామరక్షణ గావించవలెనని ఆదేశించెనట.  అలా పరమశివుడు ఆదేశించిన దేవతలే నేడు గ్రామదేవతలుగా ప్రతీ గ్రామంలోనూ వెలిసినారట.  అలా వెలిసిన వారే నూకాలమ్మ, పోలేరమ్మ, సత్తెమ్మ, మహావిష్ణువు వీరందరికీ తముడుగా పోతురాజు అనే నామ౦తో ఉద్భవి౦చెనట.kanyaka parameswari temple

అప్పటి నురిడియూ ఒక్కోక్క  ప్రాంతానికి ఒక్కోక్క  గ్రామదేవత వెలసి గ్రామసరిరక్షణార్ధమై గ్రామ పొలిమేరల్లో ఉ౦టూ గ్రామాన్ని దుష్టశక్తుల బారి నుంచి కాపాడి రక్షిసున్నారట. ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద అమావాస్య వరకూ ప్రతీరోజూ రాత్రి గ్రామ సంరక్షణార్ధమై ఈ దేవతలు తనకు “ప్రతిరూపమైన గరగలుగా వెళ్ళి ఎక్కేగుమ్మం దిగేగుమ్మంగా వెళ్తూ ఏమైనా దెయ్యాలు- భూతాలు కనిపిరిచినచో తమ తముడైన పోతురాజుకు అప్పగి౦చి వస్తారట. తన అక్క తనకు అప్పచెప్పిన దుషశక్తులను పోతురాజు బారికోడు (మాదిగవాడు) కి అష్పగి౦చి వస్తాడట. అలా అప్పగి౦చిన దూతలను బారికోడు మరల గ్రామ పొలిమేరకు తీసుకెళ్ళి దిగదుడుపులను వదిలి వస్తు౦టాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచార౦గా ఈనాడు పల్లెయ౦దు పట్టణాలయ౦దు కూడా పూర్వపు సంప్రదాయబద్దంగా ఆచరిస్తూ వస్తున్నారు.

౩.శ్రీ కోటసత్తెమ్మ దేవస్థానము , నిడదవోలు మండలం:

తిమ్మరాజుపాలెం లో వేంచేసియున్న _ శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవాలయము నందు గల శ్రీఅమ్మవారి విగ్రహము పూర్వము 11వ శతాబ్ధoలో తూర్పు చాళుక్యులు కాలము నాటిదని తెలియుచున్నది. శ్రీ అమ్మవారి విగ్రహము 1936 సంవత్సరములో తిమ్మరాజుపాలెం లో గల శ్రీ దేవులపల్లి రామమూర్తిశాస్త్రి గారి పొలములో విగ్రహము బయటపడింది, అప్పటి సు౦డి ప్రజలు మరియు చుట్టు ప్రక్కల ప్రజలు భక్తితో పూజలు నిర్వహిరిచుచున్నారు. భక్తుల యొక్క కోరికలు తీర్చు దైవముగా ప్రసిద్ధిచెంది  ప్రస్తుతo రాష్ట్రం నలుమూలల ను0డి లక్షలామంది భక్తులు విచ్చేసి నిడదవోలు అమ్మవారి దేవాలయము, శ్రీ అమ్మవారిని దర్శిరిచుకొని తీర్ధప్రసాదములు స్వీకరించి తరిoచుచున్నారు. శ్రీ అమ్మవారు “శoఖుచక్ర గధ అభయ హస్తయజ్జోప వేతధారిణిగా ఏకశిలా” విగ్రహము అయిపున్నది. ప్రతి సంవత్సరం “దసరా” (నవరాత్రులలో) ప్రత్యేక పూజలు మరియు డిశoబరు నెలలో అనగా మార్గశిర పౌర్ణమి ను0డి చవితి వరకు!) “తిరునాళ్ళు” మహోతృవములు అతి వైభవముగా జరుపబడుచుస్నవి. ఈ దేవాలయమునకు ప్రతి “ ఆదివారము మరియు మoగళవారము” లలో భక్తులు వేలాదిగాను ఇతర దినములలో వందలాదిగాను విచ్చేసి తరిoచుచున్నారు.sri kotasattemma ammavari temple