On 29.12.2021. District Collector Shri Kartikeya Mishra inaugurated the district level sports competitions organized under Nehru Youth Center.

పత్రికా ప్రకటన ,
ఏలూరు,తేదీ.29.12.2021 .
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.
బుధవారం ఏలూరు లోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల సందర్భంగా స్వామివివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాకారుల నుండి వందనం స్వీకరించారు. క్రీడాకారుల ప్రతిజ్ఞ అనంతరం కబడ్డీ క్రీడాకారులులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ పోటీలు జిల్లాలోని 9 బ్లాకులలో గ్రామీణ ప్రాంతాలలోని యువతకు క్రీడల పట్ల ఆశక్తి కల్పించేందుకు పోటీలు నిర్వహించడం జరిగింది. బ్లాకుస్థాయి పోటీలలో విజేతలైన వారు జిల్లా స్థాయి క్రీడల పోటీలు లలో పాల్గొన్నారు . జిల్లా స్థాయి పోటీలో వాలీబాల్ ,కబడ్డీ, రన్నింగ్, లాంగ్ జంప్ , షాట్ పుట్ క్రీడలలో మొత్తం 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లాఅధికారి దూలం కిషోర్, చీఫ్ కోచ్ అజిజ్ , సెట్ వేల్ మేనేజర్ శ్రీనివాస రావు , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – – – – – సమాచారం పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.