Close

On 04-11-2021 District Collector Shri Karthikeya Mishra visited the Department of Women and Child Welfare Girl’s Hostel in Denduluru village.

Publish Date : 04/11/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు , తేదీ.4.11.2021.

దెందులూరు గ్రామంలో లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాలిక హాస్టల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .
గురువారం దెందులూరు లోని బాలికల హాస్టల సందర్శించి పూర్తిగా పరిశీలించారు. హాస్టల్ కు విడుదలైన ఏపీ డబ్ల్యు ఐ డి సి నిధులను 4,20,000 హాస్టల్ అభివృద్ధికి వినియోగించి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు కె విజయ్ కుమారిని ఆదేశించారు.
తొలుత హాస్టల్ విద్యార్థులతో దినచర్య కార్యక్రమములు అడిగి తెలుసుకుని వారితో మమేకమై క్యారమ్స్ మరియు ఇతర ఆటలతో పిల్లలను ఆడించి సంతోషపరిచారు. భోజనశాల కి వెళ్లి భోజన వసతులను పరిశీలించి భోజనం ఏవిధంగా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొవాలని హాస్టల్ సూపర్నెంట్ ను ఆదేశించారు.
పండగ సందర్భంగా విద్యార్థులతో కేక్ కటింగ్ చేసారు
ఈ కార్యక్రమంలో హాస్టల్ సూపరిండెంట్ ఏ కృష్ణ కుమారి , ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. విజయ్ కుమారి, యమ్ ఆర్ ఓ ఎన్ వి నాంచారయ్య ,యమ్ డి ఓ ఏబీపీవి లక్ష్మి , సర్పంచ్ తోట ఏసమ్మ తదితరులు పాల్గొన్నారు.
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
సమాచార శాఖ ఏలూరు నుండి జారీ.