Amul Pala Velluva
Publish Date : 23/06/2021

తేదీ. 23.6.2021. జిల్లాలో అమూల్ జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో అన్ని పాల సేకరణ కేంద్రాలలో పాల సేకరణ పెంచేవిధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ తక్కువ పాలు సేకరణ జరుగుతున్న సొసైటీ లో సమావేశం నిర్వహించి వారిని చైతన్య పరచాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్( రెవెన్యూ ) శ్రీ . కె. వెంకటరమణ రెడ్డి , డి ఆర్ డి ఏ, పిడి ,జె. ఉదయభాస్కర్ ,డైరీ డి డి పి. ఉమాదేవి, Dco , పశుసంవర్ధక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.