Close

16-07-2021 గ్రామ సచివాలయాల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చైతన్యం తీసుకుని రావాలి.. కలెక్టర్ కార్తికేయ మిశ్రా

Publish Date : 17/07/2021

పత్రిక ప్రకటన

కొవ్వూరు తేదీ: 16.7.2021

గ్రామ సచివాలయాల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చైతన్యం తీసుకుని రావాలి.. కలెక్టర్ కార్తికేయ మిశ్రా

గ్రామ సచివాలయంలో పౌర సేవలను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.

శుక్రవారం కొవ్వూరు లోని గ్రామసచివాలయం-3 ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చెయ్యాలన్నారు. వీటిని పారదర్శకంగా అమలు చెయ్యడంలో వార్డు/ గ్రామ సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయాల్సి ఉందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 35 ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు 500 లకు పైగా పౌర సేవలను పారదర్శకంగా అందించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నా రు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ సామర్ధ్యాలను పెంచుకునే దిశలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పధకాలను చేరవేసే బాధ్యత గ్రామ సచివాలయ లపై ఉందన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. శానిటేషన్, గృహాల లబ్ధిదారులగుర్తింపు , ప్లానింగ్, మహిళా భద్రత కార్యదర్శి తదితరులతో వారు చేసే విధుల వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు.

కలెక్టర్ వెంట ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, ఎమ్మార్వో బి.నాగరాజు నాయక్, తదితరులు ఉన్నారు.

———————————

డివిజినల్ పిఆర్వో, కొవ్వూరు వారిచే జారీ.

PressRelease